రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలతో పాటు అన్ని వర్గాల వారికి ముఖ్యమంత్రి వై.యస్.జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో మేలు జరిగిందని, మంచి చేసే వారికే ఓటు వేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గరివిడి మండలం కోనూరు గ్రామంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. పలువురు యువకులు మంత్రి సమక్షంలో వైయస్ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో బొత్స మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో మనంవేసే ఓటు ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇవ్వాలని, భరోసా కల్పించేలా ఉండాలన్నారు. అలాంటి భరోసా వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలోనే ప్రజలకు కలిగిందన్నారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం అమలుచేసిన నవరత్న పథకాలతో ప్రతీ ఇంటా వెలుగులు ప్రసరించాయన్నారు. అమ్మఒడి, జగనన్న విద్యాకానుకలు, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, నాడు–నేడు వంటి పథకాలతో పేదకుటుంబాల చదువుకు భరోసా కలిగిందన్నారు. వైయస్ఆర్ రైతు భరోసా కింద రైతన్నలకు ఏటా పెట్టుబడి సాయం ఠంచన్‌గా అందుతోందన్నారు. జిల్లాకు మెడికల్ కళాశాల సాధించుకున్నామన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో జిల్లా ప్రగతిపథంలో పయనిస్తుందన్నారు. చంద్రబాబు పచ్చి మోసకారి అని, ఎన్నికల వేళ ఆయన చెప్పే అబద్ధాలను నమ్మొద్దన్నారు. రుణాలు మాఫీ చేస్తానంటూ 2014లో అధికారంలోకి వచ్చి రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేశాడన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు.