తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ని ఉండవల్లిలోని ఆయన నివాసం లో కలిసి నిజా నిజాలపై చర్చించామని రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడుసోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అయన సానుకూలంగా స్పందించారన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు రైల్వేకోడూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ ముక్కా రూపానంద రెడ్డి, పార్లమెంట్ అధికార ప్రతినిధి(క్లస్టర్ ఇంచార్జ్) అద్దేపల్లి ప్రతాప్ రాజు తదితరులు ఉన్నారు.