నెల్లూరు జిల్లా, కావలి రూరల్ మండలం, ముసునూరు టోల్ ప్లాజా దగ్గర బుధవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్ టేక్ చేయబోయి. వెనుక నుంచి కారు ఢీ కొంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను సమీస ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంకు చెందిన వారిగా గుర్తించారు. చెన్నైలో ఇమిటేషన్ గోల్డ్ కొనుగోలు చేసి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
![]() |
![]() |