కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపై సినీ నటుడు పృథ్వీరాజ్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాపు సమాజం ముద్రగడను అసహ్యించుకుంటోందంటూ వ్యాఖ్యలు చేశారు. గురువారం భీమవరంలో జనసేన కూటమి అభ్యర్థి అంజిబాబు తరుపున ఎన్నికల ప్రచారంలో పృథ్వీరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముద్రగడను దుమ్మెత్తిపోశారు. కాపు కులం రైలు లాంటిదని.. అందులో నింపడానికి చూడాలి తప్ప తోసేయకూడదని అన్నారు. ముద్రగడ నీకు సిగ్గుందా.. నీకు రెడ్డికాపు అనే పేరు నేనే పెట్టా.. నీకు బారసాల చేస్తాం. నీవు చస్తే ఎవడైనా విగ్రహం పెడతాడా?.. ముద్రగడ నువ్వు కాపు నాయకుడు అనే ముద్ర తీసేయ్. కాపులు నిన్ను అసహ్యించుకుంటున్నారు. నిన్ను ఉప్మా ముద్రగడ అంటున్నారు’’ అంటూ పృథ్వీరాజ్ వ్యాఖ్యలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa