ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్‌కు పులివెందుల ప్రజల ప్రేమ ఎప్పుడూ ఉంటుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 03, 2024, 03:58 PM

పులివెందులలో మూడు తరాల ప్రజలకు వైయ‌స్  కుటుంబంతో  మంచి సంబంధాలు ఉ​న్నాయి. దివంగత మహానేత వైఎస్సార్ తొలిసారి 1978లో ఎమ్మెల్యే గెలిచారు. ఆస్పత్రులు, కాలేజీలు నిర్మించారు. అప్పటి నుంచి 45 ఏళ్లుగా ఇక్కడి ప్రజలకు వైఎస్సార్‌ కుటుంబం సేవ చేస్తోంది. సీఎం వైయ‌స్  జగన్‌కు కూడా పులివెందుల ప్రజలతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వైయ‌స్  చేసిన అభివృద్ధిని సీఎం వైయ‌స్ జగన్‌ కొనసాగిస్తున్నారు. మా కుటుంబం కూడా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తోంది.  వైయ‌స్ , సీఎం వైయ‌స్ జగన్‌కు పులివెందుల ప్రజల ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. పులివెందులలో మొత్తం ఏడు మండలాలు ఉన్నాయి. అన్ని మండలాల్లో ఇంటింటికి ప్రచారం చేసి.. సీఎం వైయ‌స్ జగన్‌కు మద్దతుగా నిలవాలని ప్రజలను కోరుతున్నా. వెళ్లిన ప్రతీ చోట్లా అంతా ఆప్యాయంగా పలకరించడం సంతోషంగా ఉంది.  ఆ స్పందనే సీఎం జగన్‌ గెలుపును తెలియజేస్తోందని వైయ‌స్  భారతి అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa