ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 03, 2024, 04:03 PM

ప్రజలను టెర్రరైజ్ చేస్తున్న కూటమి నేతలకు ఓటమే సరైన గుణపాఠమ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు అన్నారు. వైయ‌స్ఆర్ సీపీ కేంద్ర కార్యాల‌యంలో మ‌ల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు,పవన్ కల్యాణ్ లు అన్నీ అవాస్తవాలు మాట్లాడుతున్నారు. బురదచల్లుతున్నారు. సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నారు. ప్రజల ఆస్దుల పత్రాలు జగన్ గారి ఇంట్లో ఉంటాయంటూ పవన్ కల్యాణ్ ఉన్మాదస్దాయిలో మాట్లాడుతున్నారు. అసలు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకువస్తుంది బిజేపినే అనే విషయం మాత్రం మరుగునపరుస్తున్నారు. ఆడబిడ్డలకు భధ్రత,రక్షణ అంటూ పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. జగన్ గారు మహిళల విషయంలో దిశయాప్ తీసుకువచ్చారు.మహిళలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు అని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa