అవనిగడ్డలో జరిగిన వారాహి విజయభేరి సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి, క్రికెటర్ అంబటి రాయుడు ఇద్దరూ వైసీపీ నుంచి బయటకు వచ్చిన వారేనని, వారు నిజంగా జగన్ ను నమ్మారని, అలాంటి వాళ్లే వైసీపీని వదిలి వచ్చేశారంటూ అందరూ ఆలోచించాలని అన్నారు. మనం మనుషులం.. రాజ్యాంగం మనకు హక్కులు కల్పించింది.. కానీ ఈ వైసీపీ ఆత్మగౌరవాన్ని తీసేస్తోందని అన్నారు. కార్యకర్తల పక్షాన నిలబడే వ్యక్తి బాలశౌరి.. కార్యకర్తలకు, జనసైనికులకు బలం ఇచ్చాడు. అలాంటి నాయకుడ్ని బందరు పార్లమెంటు నుంచి బరిలో దింపాను. ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి. బాలశౌరి జనసేన నుంచి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు... అతని బ్యాలెట్ నంబర్ 6... గాజు గాజు గుర్తుపై ఓటు వేసి బాలశౌరిని గెలిపించండి. అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఆయన బ్యాలెట్ నంబర్ 6... గాజు గుర్తుపై ఓటు వేసి బుద్ధప్రసాద్‌ను గెలిపించండి’’ అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.