సంక్షేమ పథకాలు అందకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, ఓటు అనే అస్త్రంతో ఆయనకు గట్టిగా బుద్ధి చెప్పాలని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఢిల్లీ వాళ్లతో కలిశాడని దుయ్యబట్టారు. బటన్లు నొక్కిన సొమ్ము పేదలకు అందకుండా కుట్రలు చేశాడని ధ్వజమెత్తారు. ఈ పథకాలకు బడ్జెట్‌లో ఆమోదం కూడా తెలిపామని తెలిపారు. పథకాలు ఆపగలరు కానీ.. మా విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడుగులు వేస్తున్నామని, సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని, భోగాపురం ఎయిర్‌పోర్టు విస్తరన పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో కొత్తగా 4 మెడికల్ కాలేజీలు కడుతున్నామని వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో సెల్‌ఫోన్ కనెక్టవిటీ పెంచామని అన్నారు.