చంద్రబాబు తనకు రాజకీయాల్లో ఓనమాలు నేర్పారని మాజీ కేంద్రమంత్రి, విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర విజభన జరిగిందని వివరించారు. చంద్రబాబు చెబితే రాష్ట్ర విభజన జరగలేదన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించారు. తర్వాత మీట్ ది ప్రెస్‌లో సుజనా చౌదరి మాట్లాడారు. రాజకీయ సంకల్పం కలిగిన పొలిటిషీయన్లు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల వరకు రాజకీయాలు ఉండాలి.. కానీ ఎన్నికల తర్వాత కూడా కక్ష సాధింపు రాజకీయాలు కొనసాగతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం రివర్స్ టెండరింగ్ చేసి నిలిపివేశారని వివరించారు. తనది కృష్ణా జిల్లా అని, స్థానికుడిని అని సుజనా చౌదరి వివరించారు. మహానటి సావిత్రికి మా తాతగారు ఇల్లు విక్రయించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో 22 మంది వైసీపీకి ఎంపీల ఉన్నా ఏ రోజూ రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో మాట్లాడలేదని పేర్కొన్నారు. ప్రజలను మోసం చేసే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు తీసుకొస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. తమకు అన్ని వర్గాల ప్రజలు అండగా ఉన్నారు, నన్ను గెలిపిస్తారనే నమ్మకం ఉందన్నారు. ఒకానొక సమయంలో రాజకీయాల్లోంచి వెళుతుంటే అరుణ్ జైట్లీ తనను ఆపారని గుర్తుచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa