శ్రీకాళహస్తిలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు సిద్ధం చేసిన 3250 చీరలను అధికారులు సీజ్ చేశారు. ఆటో డ్రైవరుతో పాటు ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీఐ రారాజు కథనం మేరకు... శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలోని చెంచులక్ష్మి కాలనీ రోడ్డులో వున్న ఓ గోదాంలో కొందరు చీరలను భారీగా నిల్వ చేసి ఆటోలో తరలించేందుకు సిద్ధమయ్యారు. స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ రారాజు సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆటోతో సహా రాజీవ్ నగర్ కాలనీ చెందిన ఉదయ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం అధికారులకు సమాచారం అందించారు. 13 పార్సిల్ మూటల్లో 3250 చీరలున్నట్లు నిర్ధారించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa