రాప్తాడు నియోజకవర్గంలో తాను 20 వేల మెజారిటీ సాధించడం ఖాయమని రాప్తాడు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని పరిటాలసునీత ధీమా వ్యక్తం చేశారు.రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో ఆదివారం మాట్లాడుతూ మంత్రిగా తాను చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు కూటమి ఆధ్వర్యంలో ప్రకటించిన సంక్షేమ పథకాలే ఓటర్లు తమకు అండగా నిలిచేలా చేస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రతి ఒక్కరూ సైకిల్ కు ఓటు వేసి వైసిపి రాజకు పాలనకు ముగింపు పలకాలని కోరారు.