మీ ఓటు వేరేవాళ్లు వేశారని తెలిసిన వెంటనే ముందు ప్రిసైడింగ్ అధికారిని కలవాలి. మీ ఓటు ఇతరులు వినియోగించుకున్నారని.. ప్రిసైడింగ్ అధికారి ముందు నిరూపించుకోవాలి. దాని కోసం ఓటరు గుర్తింపు కార్డు లేదా ఇతర ఏదైనా ఐడీ కార్డులను చూపించాలి. ఇక ఎన్ఆర్ఐలు అయితే పాస్‌పోర్టు సమర్పించవచ్చు. అది నిజం అని ప్రిసైడింగ్ అధికారి నిర్ధారిస్తే.. ఫామ్ 17(బి)లో పేరు, సంతకం చేసి తిరిగివ్వాలి.