రాయదుర్గం పట్టణంలోని శాంతినగర్ లో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన అరవా గంగమ్మ మృతి చెందినట్లు అర్బన్ సీఐ శ్రీనివాసులు శనివారం తెలిపారు. రాత్రి కరెంట్ లేని సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు. ఇంటి వద్దనే రోడ్డుపక్కగా నడుచుకుంటూ వెళుతున్న గంగమ్మను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు. ఢీకొన్న వాహనం ఆగకుండా వెళ్ళిపోయింది అన్నారు. కేసు నమోదు చేసామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa