నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాయగా, ఆ తరువాత నుంచి వర్షం కురిసింది. మన్యం జిల్లా కేంద్రం పాడేరుతో పాటు ఏజెన్సీ వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం కాగా, పంట పొలాల్లోకి వర్షపు నీరు చేరింది. మురుగుకాల్వలు సైతం వర్షపు నీటితో ప్రవహించాయి. అలాగే జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. తాజా వాతావరణంతో జనం ఊరట చెందుతున్నారు. ఏజెన్సీలో ముసురు వాతావరణం కొనసాగుతున్నది.