పల్నాడు జిల్లాలో ఎన్నికల సమయంలోనూ ఆ తరువాత కూడా పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. విషయం ఎన్నికల కమిషన్ దృష్టికి సైతం వెళ్లడంతో పెద్ద ఎత్తున ఫైర్ అయ్యింది. అయితే ఇక్కడ ఎస్పీ బిందు మాధవ్‌తో టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలకు సంబంధాలున్నాయంటూ ఓ పత్రికలో కథనాలు వెలువడ్డాయి. దానిపై ఆయన స్పందించారు. అలాంటిదేమీ లేదని.. అసలు సదరు ఎస్పీతో తాను ఫోన్‌లో మాట్లాడింది కూడా లేదన్నారు. అలాంటిదేమైనా ఉంటే తన ఫోన్‌ను చెక్ చేసుకోవచ్చని తెలిపారు. పల్నాడు అల్లర్లపై సిట్ అధికారులు అన్ని కోణాల్లో విచారించాలని టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు కోరారు. ఒక పత్రికలో ఎస్పీ బిందు మాధవ్ కుటుంబానికి.. మాకు బంధుత్వం ఉందని రాశారని అలాంటిదేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. తానెప్పుడూ ఎస్పీతో ఫోన్‌లో కూడా మాట్లాడింది లేదన్నారు. అవసరం అయితే తన కాల్ డేటాను సిట్ అధికారులు పరిశీలించాలన్నారు. పల్నాడు అల్లర్లపై తన ప్రమేయం ఉంటే తన పేరు ఛార్జ్ షీట్‌లో పెట్టుకోవచ్చని లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. సమస్యాత్మక బూత్‌లు ఉన్నాయి అని చెప్పినా కూడా అక్కడ ఒక కానిస్టేబుల్‌ని మాత్రమే ఉంచారని లావు శ్రీకృష్ణ దేవరాయలు వెల్లడించారు.