ఏపీలో ఎన్నికల సమయంలో అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. క్షేత్ర స్థాయిలో విచారించి నివేదికను సిద్ధం చేసిన నివేదికను ఉదయం 10 గంటలకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ డీజీపీకి అందించనున్నారు. మధ్యాహ్నానికి సీఎస్ ద్వారా సీఈఓ, సీఈసీకి ప్రాథమిక నివేదిక అందనుంది. పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేందుకు సిట్ కొంచెం గడువు కోరనుంది. రెండు రోజులపాటు మూడు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో బాధితులు, రాజకీయ నేతలు, స్థానికులు, పోలీసులను సిట్ బృందాలు విచారించాయి. ఘటనా స్థలంలో దొరికిన ఆయుధాలు, అల్లర్లకు కారణమైన వారిని గుర్తింపు, సీసీ కెమెరాలు పరిశీలన, వారిపై నమోదైన కేసులను సైతం పరిశీలించాయి. పోలీసు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం,ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే అల్లర్లు జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు.