కృష్ణా జిల్లా, అవనిగడ్డలో పోలీసులు మంగళవారం తెల్లవారుజామున కార్దన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎన్నికల అనంతరం హింస నివారణలో భాగంగా లంకమ్మ మాన్యం కాలనీలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్ ఇళ్ల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో పత్రాలు సరిగా లేని 13 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అవనిగడ్డ సీఐ త్రినాధ్ నేతృత్వంలో జరిగిన సెర్చ్ ఆపరేషన్లో ఎస్ఐ రమేష్, కోడూరు, నాగాయలంక సిబ్బంది పాల్గొన్నారు.