బాల్య వివాహాలను అంతం చేయడమే లక్ష్యంగా కొత్త రోడ్ మ్యాప్‌తో ముందుకు వెళుతున్నామని వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ బి.కీర్తి తెలిపారు. బాల్య వివాహాల నిరోధంపై న్యూఢిల్లీలో జరిగిన వర్క్‌షాప్‌కు వాసవ్య మహిళామండలి సభ్యులు హాజరయ్యారు. బాల్య వివాహరహిత భారతదేశం ప్రచారంలో భాడంగా 22 రాష్ర్టాలకు చెందిన ఎన్జీవోలు 2024-25 కోసం రోడ్‌మ్యాప్ గురించి చర్చించారని ఆమె తెలిపారు. 2030 నాటికి దేశంలో బాల్యవివాహాలను నిరోధించాలని, దేశ వ్యాప్తంగా ఉన్న చైల్డ్‌మ్యారేజీ ఫ్రీ ఇండియా(సీఎంఎఫ్‌ఐ) ప్రచారానికి చెందిన సుమారు 200 మంది ఎన్జీవో భాగస్వాములు హాజరయ్యారు. సీఎంఎఫ్‌ఐ మిత్ర పక్షమైన ఎన్టీఆర్, కృష్ణాజిల్లాల్లో పనిచేస్తున్న వాసవ్య మహిళా మండలి కూడా ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారని ఆమె తెలిపారు. బాల్య వివాహాల నిరోధం కోసం పంచాయతీలు, జిల్లా పరిషత్‌లు, స్థానిక పెద్దలతో కలిసి పని చేస్తూనే ఉంటామని తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అనేక బాలల రక్షణ సంస్థలు పరస్పరం అనుభవాలను, సవాళ్లను పంచుకున్నామని, కొత్తగా రూపొందించిన రోడ్‌మ్యాప్‌లో బాల్య వివాహాలు నిరోధానికి మరింత ఉత్సాహంగా ముందుకు వెళతామని కీర్తి తెలిపారు.