బెంగళూరులో ఐదు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. జూన్ 1 వ తేదీ జూన్ 6 వ తేదీ వరకు బెంగళూరు నగరంలో మద్యం అమ్మకాలు నిషేధం విధించారు. కేవలం వైన్ షాప్‌లు మాత్రమే కాకుండా బార్లు, పబ్‌లలో కూడా మద్యం సరఫరాను నిలిపివేయనున్నారు. అయితే ఎన్నికల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌తో పాటు కర్ణాటకలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. శాసనమండలి స్థానాల పోలింగ్, వాటి ఫలితాల వెల్లడి కారణంగా మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.
కర్ణాటకలో సిట్టింగ్ ఎమ్మెల్సీల పదవీ కాలం పూర్తి అయింది. ఆ స్థానాల్లో జూన్ 3 వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. దీంతో జూన్ 1 వ తేదీ నుంచే మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ఇక జూన్ 4 వ తేదీన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అంతేకాకుండా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు జూన్ 6 వ తేదీన వెలువడనున్నాయి. దీంతో జూన్ 1 వ తేదీ నుంచి జూన్ 6 వ తేదీ వరకు బెంగళూరులో నగరంలో మద్యం అమ్మకాలు నిషేధించబడ్డాయి.
జూన్‌లో బెంగళూరులోని అన్ని వైన్ షాపులు, బార్‌లు, పబ్‌లు దాదాపు ఒక వారం పాటు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక పబ్‌లు, బార్‌లు తమ కస్టమర్‌లకు ఆల్కహాల్ లేని పానీయాలు, ఆహారాన్ని అందించడానికి అధికారులు అనుమతించారు. కర్ణాటకలో ఖాళీ అయిన శాసనమండలి స్థానాల ఎన్నికలకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 3 వ తేదీన ఎన్నికలు జరుగుతాయని.. జూన్ 6 వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి చేయనున్నట్లు తెలిపింది.
కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. కర్ణాటక ఈశాన్య గ్రాడ్యుయేట్ స్థానం నుంచి ఎన్నికైన డాక్టర్ చంద్రశేఖర్ బి పాటిల్.. కర్ణాటక సౌత్-వెస్ట్ గ్రాడ్యుయేట్‌ల అయనూరు మంజునాథ.. బెంగళూరు గ్రాడ్యుయేట్‌లకు చెందిన ఎ దేవెగౌడ.. కర్ణాటక సౌత్-ఈస్ట్ టీచర్స్ డాక్టర్ వైఎ నారాయణస్వామి.. ఎస్‌ఎల్ భోజే కర్ణాటక నైరుతి ఉపాధ్యాయులు గౌడ.. కర్ణాటక సౌత్ టీచర్లకు చెందిన మరితిబ్బే గౌడ.. జూన్ 21 వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఆ లోపు ఎన్నికలు జరిపి ఫలితాలు వెలువరించనున్నారు.