ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పదవి విరమణ చేసిన ఏసీబీ కోర్టు న్యాయాధికారి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 30, 2024, 07:58 PM

ఏసీబీ కోర్టు న్యాయాధికారి సునీత ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నందున బుధవారం ఘనంగా వీడ్కోలు పలికారు. న్యాయమూర్తులందరూ గురువారం నుంచి సెలవుల్లో వెళ్తున్నందుకు బుధవారం ఈ వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎన్‌.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పలువురు న్యాయాధికారులు, న్యాయశాఖ సిబ్బంది పాల్గొని జడ్జిని ఘనంగా సన్మానించారు. పదవి విరమణ చేయనున్న న్యాయ శాఖ ఉద్యోగులు నరసింహారావు, సి.నరసింహులను కూడా ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. మొదటి అదనపు జిల్లా జడ్జి ఏ. శ్రీనివాస కుమార్‌ కూడా ఈ నెల 31న పదవి విరమణ చేయనున్నారు. ఈకార్యక్రమంలో జిల్లా కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమానికి అదనపు జిల్లా న్యాయాధికారులు ప్రతిభాదేవి, జి.భూపా ల్‌రెడ్డి, పి.పాండురంగారెడ్డి, సబ్‌ జడ్జ్జిలు దివాకర్‌, జ్యోత్స్నా దేవి, పలువురు న్యాయశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com