మదనపల్లె పట్టణంలో రెండు ప్రజాసంఘాల నేతల మధ్య ఆధిపత్య పోరుతోనే శేషాద్రి హత్య జరిగిందని మదనపల్లె డీఎస్పీ ప్రసాదరెడ్డి వెల్లడించారు. శుక్రవారం స్థానిక టుటౌన్‌లో విలే కర్ల సమావేశంలో శేషాద్రి హత్యకే సులో ఏడుగురు నిందితుల అరెస్టు చూపిన డీఎస్పీ మాట్లాడుతూ ఈ నెల 25న శ్రీవారినగర్ శివార్లలోని మంజునాధకాలనీ వద్ద పుంగనూరు శేషాద్రి హత్య జరిగిందన్నారు. ఈ కేసులో నలుగురు సీఐలను ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి హత్యకేసు క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టామన్నారు. ప్రజాసంఘాల నేతల మధ్య భూ దందాలు, కబ్జాలు, సెటిల్‌మెంట్లపై వివాదాలే ఈ హత్యకు కారణమన్నారు. భూదందాలు, సెటిల్మెంట్‌లో భాగంగా విచ్ఛలవిడిగా దాడులకు పాల్పడడం, దౌర్జన్యాలు చేయడం, కులసంఘాలను అడ్డుపె ట్టుకుని ప్రజలను వేధింపులకు గురిచేయడం, అట్రాసిటీ కేసులు పెడుతూ ప్రజలు, పేదలను భయభ్రాంతులకు గురి చేస్తున్న రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంద న్నారు. ఇదే రీతిలో రామారావుకాలనీకి చెందిన కొండుపల్లె ఆనంద్ ప్రజాసంఘంలో పుంగనూ రు శేషాద్రి గతంలో అనుచరుడుగా ఉండేవాడ న్నారు. ఇటీవల కొద్ది కాలంగా ఇరువురి మధ్య ఆధిపత్య పోరు చెలరేగడంతో విడిపోయారు. శేషాద్రి బహుజన భీమసేన పేరిట ఓ సంఘా న్ని పెట్టుకుని భూదందాలు, సెటిల్మెంట్లు చేసే వాడు. దందాల విషయమై పోటీ పడ్డారు. ఇటీ వల రామారావుకాలనీలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం, కొండుపల్లె ఆనంద్‌కు అసూ య, ఈర్ష్య పెరిగి ఎలాగైనా శేషాద్రిని మట్టుపె ట్టాలని పథకం వేశారు. ఈపథకం ప్రకారమే తన అనుచరులను కూడగుట్టకుని పుంగనూరు శేషాద్రిని ప్రత్యర్థులు ఈ నెల 25న అతి దారుణంగా కత్తులు, వేటకొడవళ్లతో హత్య చేసి న సంఘటన తెలిసిందే. కేసులో క్రైమ్ నెంబరు 152-2024గా కేసు నమోదు చేసిన మదనపల్లె డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, టూటౌన్ సీఐ యువ రాజు, వన్‌టౌన్ సీఐ వల్లీబసు, తాలుకా సీఐ శేఖర్, రూరల్ సర్కిల్ సీఐ సద్గురుడు, టూటౌన్ ఎస్‌ఐలు వెంకటసుబ్బయ్య, ఇనాయతుల్లా తదితరులు కేసును లోతుగా దర్యా ప్తు చేపట్టి పక్కా సమాచారంతో గొల్లపల్లె వాసి కొండుపల్లె ఆనంద్, విజయనగర్ కాలనీకి చెందిన తుపాకుల మణికంఠ, విజయ నగర్‌కాలనీకి చెందిన బండి మహేష్, శివాజీ నగర్ చీకిలగుట్టకు చెందిన సాతిపడి రాజశేఖర్, రామారావుకాలనీకి చెందిన మొరుంపల్లె చరణ్ కుమార్, ముసలిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అలియా స్ చెన్నారెడ్డి, గౌతమీ నగర్‌కు చెందిన పఠాన్ నజీర్‌ఖాన్‌ను అరెస్టు చేశారు. దీంతో పాటు హత్యకు వినియోగించిన ఇన్నోవా కారును సమకూర్చిన రుద్ర, హరిపై కూడా కేసు నమో దు చేశారు. హత్యకు ఉపయో గించిన కత్తులు, సమ్మెట, కారు, ఆటో, ద్విచక్ర వాహనాన్ని పోలీ సులు సీజ్‌చేశారు. కార్యక్రమంలో క్రైమ్ పార్టీ, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.