పొగాకు వినియోగం ప్రాణాంతకమని వాల్మీకిపురం ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఫైరోజా బేగం పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వాల్మీకిపురం మండల వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో పొగాకు కారణంగా కలిగే నష్టాలు, ప్రాణాపాయం తదితర విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. చింతపర్తి పీహెచ్‌సీ ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వ హించి పొగాకుతో జరిగే నష్టాలను ప్రజలకు తెలియ జేశారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు ప్రభుచరణ్ వాల్మీకిపురంలో కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో డాక్టర్లు రవికుమార్, హర్షితారెడ్డి, శివాణి, హిమ బిందు, సూపర్‌వైజర్ సుధాకర్, హెల్త్‌ఎడ్యుకే టర్ మహ్మద్‌రఫీ, టీబీ యూనిట్ అధికారి నాగిరెడ్డి, సబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.