పల్నాడు జిల్లా, రెంటటచింతల వడ్డెర బావి సమీపంలో డయేరియా ప్రబలింది. ఒకే బజారులో వాంతులు, విరేచనాలుతో బాధపడుతుండగా అందులో ఓ వ్యక్తి ఆదివారం వేకువ జామున మృతి చెందాడు. మరో ముగ్గురు మాచర్ల ,పిడుగురాళ్లలోని ప్రయివేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సేకరించిన వివరాలిలా వున్నాయి.. కాలనీకి చెందిన పేరూరి చిన చంద్రయ్య(72) శనివారం మధ్యాహ్నం నుంచి వాంతులు విరేచనాలతో బాధపడు నీరసించి ఆదివారం వేకువ జామున ప్రాణాలిడిచారు. అతని ఇంటికి ఎదురుగా వున్న యామర్తి తిరుపతమ్మ ఆమె కూతురు హవేలీ కూడా డయేరియా బారిన పడ్టారు. వెంటనే పిడుగురాళ్లకు తరలించి ప్రయివేట్ వైద్యశాలలో చికిత్స చేయిస్తున్నారు. ఆత్మకూరి లక్ష్మయ్య కూడా వాంతులు, విరేచనాలతో బాధపడుతుంటే శనివారం రాత్రి మాచర్లకు తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. పంచాయతీ ఓవర్ హెడ్ ట్యాంక్‌లో పాకుడు పట్టి ఉందని పలువురు చెబుతున్నారు. తక్షణమే స్పందించి మెడికల్ క్యాంప్ నిర్వహించి డయేరియా వ్యాపించకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.