గ్రామదేవతల మొక్కుబడులను తీర్చుకోవటం అమ్మ వారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించటం ద్వారా ప్రజలంతా సుభిక్షంగా ఉంటారని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ అన్నారు. కర్లపాలెం మండలంలోని పెదపులుగువారిపాలెంలో అక్కలవారి ఈలవేల్పు శ్రీవీర్లంకమ్మతల్లి ప్రధాన వార్షికోత్సవ కొలుపుల వేడుకలలో నరేంద్రవర్మ పాల్గొని ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. అమ్మ వారి గుడి వద్ద పల్నాటి బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మ వేషధారణాలతో అలరించారు. జలబిందెలు, మొక్కుబడులు చెల్లించారు. సంబరాలను ఘనంగా నిర్వహించారు. నరేంద్రవర్మ అమ్మవారికి నారికేళఫలాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు, అక్కలవారి కుటుంబీలకు నరేంద్రవర్మను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అక్కల వెంకటరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, పిట్ల వసంతరెడ్డి, రమణారెడ్డి, వెంకటరెడ్డి, కృష్ణారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
![]() |
![]() |