ప్రధానిగా నరేంద్ర మోదీ.. ఆయన మంత్రివర్గంలోని 71 మంది ఆదివారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. వీరిలో 30 మందికి క్యాబినెట్ హోదా.. ఐదుగురికి స్వతంత్ర హోదా, మిగిలిన 36 మందిని సహాయ మంత్రులుగా నియమించారు. తాజాగా, సోమవారం సాయంత్రం క్యాబినెట్ తొలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేశంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించారు. ఈ తీర్మానానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కాగా, క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రులకు మోదీ శాఖలను కేటాయించారు.
శాఖలు- మంత్రులు
1. హోం శాఖ- అమిత్ షా
2. రక్షణ శాఖ - రాజ్‌నాథ్ సింగ్
3. ఉపరితల రవాణా - నితిన్ గడ్కరీ
4. విదేశీ వ్యవహారాల శాఖ - ఎస్ జైశంకర్,
5. ఆర్దిక శాఖ - నిర్మలా సీతారామన్
6. పౌర విమానయాన శాఖ- కింజరాపు రామ్మోహన్ నాయుడు.
7. విద్యా శాఖ-ధర్మేంద్ర ప్రధాన్
8. పెట్రోలియం సహజవనరులు-హర్‌దీప్ సింగ్ పూరి
9. రైల్వే అండ్ సమాచార ప్రసార శాఖ- అశ్వని వైష్ణవ్
10. వైద్య ఆరోగ్య శాఖ- జేపీ నడ్డా
11. వాణిజ్యం- పీయూష్ గోయల్
12. విద్యుత్ శాఖ- శ్రీపాద నాయక్
13. సాంస్కృతిక పర్యాటక శాఖ- గజేంద్ర షెకావత్
14. పర్యావరణ శాఖ.. భూపేంద్ర యాదవ్
15. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ- శివరాజ్ సింగ్ చౌహన్
16. చిన్న, మధ్యతరహ పరిశ్రమలు-. జీతన్‌రామ్ మాంఝీ
17. హౌసింగ్ అండ్ అర్నన్ డెవలప్‌మెంట్- మనోహర్‌లాల్ ఖట్టర్
18. పార్లమెంటరీ వ్యవహరాలు- కిరణ్ రిజుజు
19. కార్మిక శాఖ- మనుసుఖ్ మాండవీయ
20. జలశక్తి.- సీఆర్ పాటిల్
21. మహిళా శిశు సంక్షేమం- అన్నపూర్ణా దేవి
22. ఓడరేవులు షిప్పింగ్- శర్వానంద్ సోనోవాల్
23. టెలికమ్- ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి-జ్యోతిరాదిత్య సింధియా
24. ఉక్కు, భారీ పరిశ్రమలు- హెచ్‌డీ కుమారస్వామి
25. క్రీడలు- చిరాగ్ పాశ్వాన్
26. మానవ వనరులు- ధర్మేంద్ర ప్రధాన్
27. జౌళి- గిరిరాజ్ సింగ్
28. బొగ్గు, గనుల శాఖ- కిషన్ రెడ్డి
29. పంచాయతీ రాజ్, ఫిషరీస్- రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్)
30. సామాజిక న్యాయం-సాధికాారికత- డాక్టర్ వీరేంద్ర కుమార్
31.కన్జ్యూమర్స్ అఫైర్స్ అండ్ ఫుడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్- ప్రహ్లాద్ జోషీ
32. గిరిజన సంక్షేమం- జువల్ ఓరమ్
సహాయ మంత్రులు
1. హోం శాఖ సహాయ మంత్రి- బండి సంజయ్
2. భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ- భూపతిరాజు శ్రీనివాసవర్మ
3. టూరిజం శాఖ- సురేశ్ గోపి
4. గ్రామీణాభివృద్ధి శాఖ- పెమ్మసాని చంద్రశేఖర్