ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో పలు ప్రైవేట్ పాఠశాలల బస్సులను శుక్రవారం దర్శి రవాణా శాఖ అధికారి రవికుమార్ తనిఖీలు చేశారు. తనిఖీలో భాగంగా ఫిట్నెస్ లేకుండా టాక్స్ కట్టకుండా తిరుగుతున్న రెండు ప్రైవేట్ బస్సులపై కేసు నమోదు చేసి 90 వేల రూపాయలు జరిమానా విధించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని స్కూల్ బస్సులపై కేసు నమోదు చేసి జరిమానా విధించడం జరుగుతుందని దర్శి రవాణా శాఖ అధికారి రవికుమార్ హెచ్చరించారు.