నంద్యాల జిల్లా, దొర్నిపాడు మండలం డబ్ల్యూ.కొత్తపల్లె గ్రామానికి చెందిన కారు డ్రైవరు యోగీశ్వరరెడ్డిని అరెస్టు చేసి రూ. 18.20 లక్షలు విలువ చేసే ఆభరణాలతో పాటు రూ.50 వేలు నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ షర్ఫుద్దీన్ శుక్రవారం తెలిపారు. ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ కారు డ్రైవర్ యోగీశ్వ రరెడ్డి ఈనెల 4, 8 తేదీలలో బంగారు ఆభరణాలు దొంగలించాడని సందీప్‌రెడ్డి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కారు డ్రైవరుగా పని చేస్తున్న వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది. యోగీశ్వరరెడ్డి 5.8 గ్రాముల బం గారు డైమండ్ నెక్లెస్, 11 గ్రాముల బంగారు నెక్లెస్, 35 గ్రాముల మరో నెక్లెస్, 49 గ్రాములున్న నాలుగు బంగారు గాజులు, 14 గ్రాములున్న బంగారు డాలరును, రూ. 50 వేలు నగదు దొంగలించారని చెప్పారు. దొర్నిపాడు హెచ్‌పీ పెట్రోలు బంకు వద్ద ఆళ్లగడ్డ రూరల్ సీఐ హనుమంత నాయక్, దొర్నిపాడు ఎస్‌ఐ సురేష్ తమ సిబ్బం దితో దాడులు నిర్వహించి యోగీశ్వరరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నిందితున్ని కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ రిమాండుకు ఆదేశించారని చెప్పారు.