ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రులకు శాఖల కేటాయింపు కూడా పూరై.. పాలన ప్రారంభించారు. ఇక ఏపీని అభివృద్ధి దిశగా నడిపించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో తమతో కలిసి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన.. పలు కీలక మంత్రిత్వశాఖలు కూడా కట్టబెట్టారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పవన్ కళ్యాణ్‌కు కేటాయించారు. తాజాగా ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ప్రభుత్వ కార్యక్రమాల్లో, అలాగే ఆఫీసుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా ఉండాలని ఆదేశించారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి ఫోటోతో పాటుగా, ఉప ముఖ్యమంత్రి ఫోటో కూడా ఉండాలని ఆదేశించినట్లు నెట్టింట చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఇక జనసేన శ్రేణులు, పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈ విషయం తెలిసి సంబరపడుతున్నారు.
మరోవైపు 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి జనసేన పోటీ చేసింది. కూటమిగా బరిలోకి దిగిన మూడు పార్టీలు గ్రాండ్ విక్టరీ కొట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లలోనూ గెలుపొందింది. అలాగే మంత్రివర్గంలో మూడు మంత్రి పదవులను సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి దక్కగా.. ఆ పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌లకు సైతం ప్రాధాన్య శాఖలు దక్కాయి. నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్‌కు సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక , పర్యాటకశాఖ మంత్రిగా నియమితులయ్యారు.