టీడీపీ పార్టీ కార్యకర్తలు పేట్రేగిపోతున్నారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ, శంకుస్థాపనల శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం మండపాకలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్ సెంటర్ భవనాల వద్ద మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ చిత్రాలున్న శిలాఫలకాలను టీడీపీ శ్రేణులుధ్వంసం చేశాయి. ఈ ఘటనపై తణుకు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వైయస్ఆర్‌సీపీ మండల అధ్యక్షుడు బోడపాటి వీర్రాజు తెలిపారు.
![]() |
![]() |