ఐఆర్‌ఏఎస్ అధికారి కేవీవీ సత్యనారాయణని నార్త్ ఈస్టర్న్ రైల్వేలో జాయిన్ కావాల్సిందిగా ఈ నెల 13వ తేదీన రైల్వే బోర్డు ఆయనకు ఆదేశాలిచ్చింది. ఈ నెల 18వ తేదీతో రాష్ట్రంలో ఆయన డిప్యుటేషన్ ముగియనుంది. 2017 నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖలో సెక్రటరీగా విధులు నిర్వహించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అత్యంత కీలకమైన నిధుల చెల్లింపు విధులను జగన్ ఈ అధికారి చేతిలో పెట్టారు. ఏపీఎ్‌సడీసీ పేరుతో ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని మళ్లించి బ్యాంకుల నుంచి రూ.25,000 కోట్ల అప్పు రాజ్యాంగ విరుద్ధంగా తెచ్చారు అని కొంతమంది ఆరోపిస్తున్నారు. అలానే ఖజానాకు జమ కావాల్సిన మద్యం వ్యాట్ ఆదాయాన్ని స్పెషల్ మార్జిన్ పేరుతో బేవరేజెస్ కార్పొరేషన్‌కు మళ్లించి అడ్డగోలుగా రూ.22,500 కోట్ల అప్పులు చేశారు అని టీడీపీ నేతలు వాపోతున్నారు.
![]() |
![]() |