విజయవాడ నగరంలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో గంట సేపు కురిసిన వర్షానికి నగరంలోని రహదారులు చెరువుల్లా మారాయి. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాగా, నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ రోడ్డులో వర్షం నీరు నిలిచిపోయిన ప్రాంతాన్ని నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్‌తో కలిసి పురపాలకశాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. భవిష్యత్తులో వరద నీరు రోడ్లపై నిలవకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, జలమయం అయ్యే ప్రధాన రహదారులను క్షేత్రస్థాయిలో మంత్రి పర్యటించారు. అధికారులకు సూచనలు చేశారు.
![]() |
![]() |