పార్టీ బలోపేతానికి పార్టీ కోసం కష్టపడిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ ఛార్జ్ గూడూరి ఏరీక్షన్ బాబు అన్నారు. మంగళవారం దోర్నాలలో కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు. అధికారం వచ్చాక వచ్చే వారిని దూరంగా ఉంచాలని అది ఏ పార్టీ వారైనా ఒకటేనన్నారు. అందరికి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి అందరూ సహకరించాలన్నారు.