అమలాపురం పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో 2024-25 సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల20న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు కన్వీనర్ ఎం.వేణుగోపాలవర్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 9గంటల నుంచి కాకినాడలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలో ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయి. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో షెడ్యూల్ ప్రకారం హాజరు కావాలని కోరారు. ఈనెల 20నుంచి 25వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. 20న మెరిట్ నంబరు 1 నుంచి 137 వరకు, మధ్యాహ్నం 138 నుంచి 286 వరకు, 21న ఉదయం 287 నుంచి 404, మధ్యాహ్నం 405 నుంచి 561 వరకు, 22న ఉదయం 562 నుంచి 707 వరకు, మధ్యాహ్నం 708 నుంచి 838 వరకు, 23న ఉదయం 839నుంచి 1005 వరకు, మధ్యాహ్నం 1006 నుంచి 1115 వరకు, 24న ఉదయం 1 నుంచి 286, మధ్యాహ్నం 287 నుంచి 561 వరకు, 25న మెరిట్ 562 నుంచి 1115 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని వర్మ చెప్పారు.