ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విజయవాడ చేరుకున్న ఆయన క్యాంపు కార్యాలయంలోకి డిప్యూటీ సీఎంగా తొలిసారి అడుగు పెట్టారు. విజయవాడ విజయవాడ సూర్యారావుపేటలోని నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్‌లో ఉన్న క్యాంప్ కార్యాలయంలో ముందుగా పూజలు నిర్వహించారు.. అనంతరం బాధ్యతలు చేపట్టారు. తన శాఖలకు సంబంధించి ఫైల్స్‌పై సంతకాలు చేశారు.. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్షలు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫైల్స్‌పై సంతకాలు చేశారు. అయితే పవన్ ఇక్కడ కూడా సింప్లిసిటీ కనిపించింది.. ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫైల్స్‌పై సంతకాలను తన అభిమాని ఇచ్చిన పెన్నుతో చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ మంగళవారం మధ్యాహ్నం మంగళగిరి నుంచి బయల్దేరి అమరావతిలో ఉన్న సచివాలయానికి బయల్దేరారు. ఆయనకు అమరావతి రైతులు అడుగడునా ఘన స్వాగతం పలికారు. అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వెళుతుండగా.. ఓ అభిమాని ఓ పెన్నును గిఫ్ట్‌గా అందించారు. ఈ పెన్‌ను జాగ్రత్తగా తీసకుని జేబులో పెట్టుకున్నారు.
అయితే ఆ పవన్ అభిమాని ఇచ్చిన పెన్ను గురించి మర్చిపోలేదు.. గుర్తుపెట్టుకుని మరీ ఇవాళ తీసుకొచ్చి ఫైల్స్‌పై సంతకాలు చేయడంతో జనసైనికులు ఖుషీలో ఉన్నారు. పవన్ కళ్యాణ్‌కు అభిమానులు అంటే ఎంత ఇష్టమో తెలుస్తోందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే గతవారం పవన్ కళ్యాణ్‌కు వదిన కొణిదెల సురేఖ ఓ పెన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు.. ఆ పెన్ విలువ లక్షకుపైగా ఉంది.. అయినా సరే ఆ పెన్‌తో కాకుండా అభిమాని ఇచ్చిన పెన్‌తో సంతకం చేయడం విశేషం. పవన్‌కు అభిమాని పెన్ ఇవ్వడం.. ఇవాళ ఫైల్స్‌పై అదే పెన్‌తో సంతకం చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఆ పెన్ను విలువ కేలం పదిరూపాయలు మాత్రమే. పెన్ను విలువ ముఖ్యం కాదు.. అభిమానికి పవన్ ఇచ్చిన ప్రాధాన్యం ముఖ్యం అంటున్నారు.