2019 లో నాగ చైతన్య నటించిన యుద్ధం శరణం సినిమా విడుదలైంది. ఆ సినిమాలో హీరో నాగ చైతన్య.. మెడిసిన్‌ను సరఫరా చేసేందుకు.. దూరం ప్రయాణించే డ్రోన్‌లను తయారు చేస్తూ ఉంటాడు. అయితే ఆ సినిమా వచ్చినపుడు ఇలాంటి డ్రోన్లు తయారు చేయడానికి చాలా ఏళ్లు పడుతుందని అనుకున్నాం. కానీ ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఎన్నో మార్పులు, వింతలు, విశేషాలు చోటు చేసుకుంటున్నాయి. డ్రోన్ల ద్వారా డెలివరీ చేసే వ్యవస్థను తాజాగా బ్లూ డార్ట్ అనే లాజిస్టిక్ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. డ్రోన్ల ద్వారా వస్తువులను డెలివరీ సర్వీసులను ప్రారంభించింది. అయితే గతంలోనే తెలంగాణ సర్కార్ డ్రోన్ల ద్వారా మెడిసిన్ సరఫరా చేసే పైలట్ ప్రాజెక్టును విజయవంతంగా ట్రయల్స్ చేసింది. 2021 సెప్టెంబర్‌లో తెలంగాణలోని వికారాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం డ్రోన్ల ద్వారా మెడిసిన్‌లను సరఫరా చేసే ప్రక్రియకు సంబంధించి ట్రయల్స్ నిర్వహించి సక్సెస్ అయింది.
ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ బ్లూ డార్ట్.. డ్రోన్ ద్వారా వస్తువుల సరఫరాను ప్రారంభించింది. డ్రోన్ టెక్నాలజీ సంస్థ స్కై ఎయిర్ సహకారంతో డ్రోన్ డెలివరీలను సక్సెస్‌ఫుల్‌గా ప్రారంభించింది. ఈ నిర్ణయం.. కస్టమర్లకు మరింత పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలు అందించేందుకు అవకాశం కల్పిస్తోందని పేర్కొంది. రోజురోజుకూ పెరుగుతున్న ఇ-కామర్స్ రంగంపై దృష్టి సారిస్తూ ఈ వినూత్నమైన డ్రోన్ టెక్నాలజీ ద్వారా వస్తువులను ఆర్డర్ చేసిన రోజే డెలివరీ చేసేందుకు ఉపయోగపడనుంది. ఇలా డ్రోన్ల ద్వారా వస్తువులను డెలివరీ చేయడం వల్ల.. సమయం ఆదా కావడంతోపాటు పర్యావరణానికి కూడా నష్టం కల్గించడం తగ్గుతుందని బ్లూ డార్ట్ సంస్థ వెల్లడించింది.
ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ బ్లూ డార్ట్.. డ్రోన్ ద్వారా వస్తువుల సరఫరాను ప్రారంభించింది. డ్రోన్ టెక్నాలజీ సంస్థ స్కై ఎయిర్ సహకారంతో డ్రోన్ డెలివరీలను సక్సెస్‌ఫుల్‌గా ప్రారంభించింది. ఈ నిర్ణయం.. కస్టమర్లకు మరింత పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలు అందించేందుకు అవకాశం కల్పిస్తోందని పేర్కొంది. రోజురోజుకూ పెరుగుతున్న ఇ-కామర్స్ రంగంపై దృష్టి సారిస్తూ ఈ వినూత్నమైన డ్రోన్ టెక్నాలజీ ద్వారా వస్తువులను ఆర్డర్ చేసిన రోజే డెలివరీ చేసేందుకు ఉపయోగపడనుంది. ఇలా డ్రోన్ల ద్వారా వస్తువులను డెలివరీ చేయడం వల్ల.. సమయం ఆదా కావడంతోపాటు పర్యావరణానికి కూడా నష్టం కల్గించడం తగ్గుతుందని బ్లూ డార్ట్ సంస్థ వెల్లడించింది. ఈ డ్రోన్ టెక్నాలజీ ద్వారా వస్తువుల డెలివరీపై స్పందించిన బ్లూ డార్ట్ మేనేజింగ్ డైరెక్టర్ బాల్ఫోర్ మాన్యుయెల్.. భారత్‌లో లాజిస్టిక్స్ రంగం ప్రస్తుతం దూసుకెళ్తోందని చెప్పారు. భారత్ బలమైన ఆర్థిక వృద్ధి.. కస్టమర్ల ఆకాంక్షలు, దేశంలోని టైర్ 2, టైర్ 3 నగరాల్లో అభివృద్ధి.. ప్రజల్లో కొనుగోలు శక్తిని గణనీయంగా పెంచిందని వెల్లడించారు.