మదనపల్లె మండలంలో పలు గ్రామాల్లో తాగునీటి సమస్య ఉందని వాటికి తాత్కాలికం కాకుండా శాశ్విత పరి ష్కారం చూపాలని ఎమ్మెల్యే షాజహానబాషా అధికారులను ఆదేశించా రు. సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ఇ.రెడ్డెమ్మ అధ్యక్షతన అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని కోళ్లబైలు, అంకిశెట్టిపల్లె, బొమ్మనచె రువు, మాలేపాడు, తట్టివారిపల్లె, సీటీఎం-2, కొత్తఇండ్లు, ఈశ్వరమ్మకా లని, కొత్తపల్లె గ్రామ పంచాయతీల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ, పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని చెప్పగా, ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీటి సమస్య ఉన్న గ్రామాల్లో శాశ్వత పరిష్కారంగా కొత్త బోర్లు వేయించి కొత్త మోటార్లు, పైప్‌లైన బిగించాలని ఆదేశించారు. మండల పరిషతలో మూడు మోటార్లు రిజర్వులో ఉండాలని సూచిం చారు. సీటీఎం-2(క్రాస్‌రోడ్డు) గ్రామ పంచాయతీలో 300 ఇళ్ల స్థలాలను అనర్హులకు కేటాయించారని స్థానికులు ఆధారాలతో సహా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచా రించాలని ఎమ్మెల్యే తహసీల్దార్‌ను ఆదేశించారు. అంతే కాకుండా ఇళ్ల పట్టాలు తీసుకుని ఆరు నెలలుగా ఇళ్ల నిర్మాణం చేపట్టని వారికి నోటీసు లు ఇచ్చి, అక్రమాలను గుర్తించాలన్నారు. కోళ్లబైలు, సీటీఎం-2 గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయని వాటి ని స్వాధీనం చేసుకోవాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. గ్రామ పంచా యతీ కార్యదర్శులు ప్రతి రోజు ఆయా పంచాయతీ సచివాలయాలను, ఏదేని ఒక గ్రామాన్ని తప్పని సరిగా పరిశీలించాలన్నారు. ఓవర్‌హెడ్ ట్యాంకులు ప్రతి మూడు నెలలకు ఒకసారి శుభ్రం చేయించి బ్లీచింగ్ వేయించాలన్నారు. చిప్పిలి సమ్మర్‌స్టోరేజి ట్యాంకు నుంచి చాలా మంది ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని, అలాంటి వాహనాలను సీజ్ చేసి, పీడీ యాక్టుకు సిఫారసు చేయాలన్నారు. మండలంలో కొత్తగా ఏర్పడిన 9 గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సర్పంచలు నగదు వితడ్రా చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీనిపై డీపీవోతో మాట్లాడి సర్పంచలు, సెక్రటరిలకు జాయింట్ చెక్‌పవర్ వచ్చే లా చర్యలు చేపడతామన్నారు. కాగా తొలిసారి ఎమ్మెల్యేగా ఎంపీడీవో కార్యాలయానికి వచ్చిన షాజహానబాషాకు ఎంపీపీ రెడ్డెమ్మ, ఎంపీడీవో భానుప్రసాద్ శాలువ కప్పి, పుష్ఫగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సమావేశంలో తహీసీల్దార్ రమాదేవి, ఏపీఎం సురేష్‌రెడ్డి, ఏపీవో సుబ్ర మణ్యం, ఆర్‌డబ్ల్యూఎస్, పీఆర్ ఏఈలు చందన, రమణ, సీడీపీవో సుజాత, వనటౌన ఎస్‌ఐ హరిహరప్రసాద్, చీకిలబైలు సర్పంచ ప్రభాకర్, కొత్తపల్లె ఎంపీటీసీ దేవేంద్ర, సీటీఎం మాజీ సర్పంచలు ప్రభాకర్‌రెడ్డి, రెడ్డిరామ్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.