ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఐదు సంతకాలకు కేబినెట్ ఆమోదం ఆనందదాయకమని టీడీపీ మండల అధ్యక్షుడు పాలగిరి సిద్ధా పేర్కొన్నారు. కడప జిల్లా, ములకలచెరువు మండలంలోని పెద్దపాళ్యంలో సోమవారం తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత దాసరిపల్లి జయచంద్రారెడ్డి ఆదేశాలతో నాయకులు, కార్యకర్తలతో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్‌ల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పాలగిరి సిద్ధా మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధం గా విధులు చేపట్టిన మొదటి రోజే ప్రజల కోసం ఐదు సంతకాలు చేసిన ఘనత చంద్ర బాబుకే దక్కుతుందన్నారు. చంద్రబాబు సంతకాలు చేసిన మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటి లింగ్ చట్టం రద్దు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, సామాజిక పింఛన్ల పెంపు, స్కిల్ సెన్సెస్‌లను కేబినేట్ సమావేశంలో ఆమోదించడం శుభపరిణామమన్నారు. సమావేశంలో టీడీపీ నేత కేశవులు, మండల ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆది, మాజీ సర్పంచ రమణ, నాయకులు రమణమూర్తి, శ్రీనివాసులు, రెడ్డెప్ప, గంగాద్రి, గణేష్, భజంత్రి రామాంజులు, నాగేంద్ర, శివన్న, మధు, పత్రాప్‌నాయుడు, భాస్కర్‌నాయు డు, కిరణ్, రవి, శివ పాల్గొన్నారు. కాగా మండలంలోని బురకాయలకోటలో సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబదబునాయుడు చిత్రపటానికి బీసీ సంఘాల నేతలు, నాయ కులు క్షీరాభిషేకం చేశారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు బీసీలకు తొమ్మిది మంత్రి పదవులు కేటాయించి స్వీకర్‌గా అయ్యన్న పాత్రుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షు డిగా పల్లా శ్రీనివాసులుకు అవకాశం కల్పించారని సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్ర మంలో టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు, రాజంపేట పార్లమెంటు విభాగం బీసీ సెల్ అధికార ప్రతినిధి మత్తుకూరు మౌళా, రాష్ట్ర పాల ఏకరి సాధికార సమితి సభ్యులు జేసీబీ సుధాకర్‌నాయుడు, యూనిట్ ఇనచార్జి రామకృష్ణమ రాజు, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు విజయ్‌కుమార్, మాజీ సర్పంచ బంకు నరసింహులు, నాయకులు మురళీధర్‌రావు, గోపాల్‌రాజు, చాంద్‌బాషా, బుర్రా రమణ, బంగారు బాబు, వలిసాబ్ తదితరులు పాల్గొన్నారు.