మెరుగైన సేవలు అందకుంటే విద్యుత్ అదాలతలో ఫిర్యాదు చేయాలని సీజీఆర్‌ఎఫ్ చైర్మన్ రిటైర్డ్ జడ్జి శ్రీనివాస ఆంజనేయమూర్తి సూచించారు, ప్రొద్దుటూరు స్ధానిక విద్యుత్ రెవెన్యూ కార్యాలయం ఆవరణలో విద్యుత్ అదాలత నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పిర్యాదులు చేసినా పరిష్కారం కాని దీర్ఘకాలిక సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. ఈ సందర్బంగా 14 రకాల ఫిర్యాదులు అందగా, అందులో విద్యుత్ సర్వీసుల కేటగిరి మార్పులకు సంబందించి 5, లోవోల్టేజీ సమస్యపై నాలుగు, కొత్త సర్వీసులకు రెండు, స్ధంబాలలపై తీగల మార్పిడి కోరుతూ మూడు ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ఈ ఫిర్యాదులన్నింటిని సత్వరం పరిష్క రించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్ధిక కమిటీ సభ్యుడు కె రామమోహన్ రావు, సాంకేతిక సభ్యుడు అంజనీకుమార్ స్వతంత్ర సభ్యులు ఈశ్వరమ్మ ఎస్‌ఏవో మధు, డివిజన్ ఈఈ శ్రీనివాసులరెడ్డి డిఈఈలు ఏఈ లు అకౌంట్స్ విబాగం అధికారులు పాల్గొన్నారు.