తెలుగు ఫిలిం అండ్ డిజిటల్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ షెడరేషన్(టీఎఫ్‌డీఐఈఎఫ్) కార్యకలాపాలను విజయవాడ ప్రధాన కేంద్రంగా నిర్వహిస్తామని ఫెడరేషన్ నాయకులు తెలిపారు. తెలుగు ఫిలిం అండ్ డిజిటల్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్, 24 అనుబంధ సంఘాల ఉభయ తెలుగు రాష్ట్రాల కన్వీనర్ వెల్లంకి శ్రీనివాసరావు నేతృ త్వంలో ఫెడ రేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వల్లభనేని అనిల్ కుమార్, పీఎస్‌ఎన్ దొర గాంధీనగర్‌లో కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రధాన కార్యదర్శి దామోదర ప్రసాద్ మాట్లాడారు. ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ది తోడ్పాటునందిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. రెండేళ్ల క్రితమే నగరంలోని కార్యాల యాన్ని ప్రారంభించినా గత ప్రభుత్వం సినీ పరిశ్రమకు తగిన సహకారం అం దించకపోవడంతో కార్యాలయ కార్యకలపాలు సజావుగా సాగలేదన్నారు. విజ యవాడ ప్రధాన కేంద్రంగా విశాఖపట్టణం, రాజమండ్రి, తిరుపతి కార్యాల యాల కార్యకలాపాలను కొనసాగిస్తామని ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యద ర్శులు తెలిపారు. రాష్ట్రంలోని 24 అనుబంధ కళాకారులు, ప్రతినిధులు నగరం లోని ప్రధాన కార్యాలయంలో సంప్రదించాలన్నారు.