రాష్ట్రంలో అన్ని కులాలతో పాటు కాపులంతా అండగా నిలవడంతోనే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కాపుల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉంది. టీడీపీ హయాంలో కాపు కార్పొరేషన్ ద్వారా కాపు విద్యార్థుల విదేశీ విద్య కోసం రూ.11లక్షలు అం దించాం. జగన్ వచ్చాక అది ఉందో లేదో తెలియని పరిస్థితి. కాపులను జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది అని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడ అమ్మ కల్యాణ మండపంలో రాయల్ క్లబ్స్ అసోసి యేషన్ అధ్వర్యంలో బొండా ఉమాకు శుక్రవారం సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమా మాట్లాడారు. అనేక సేవా కార్యక్రమాల ద్వారా కాపుల అభ్యున్నతికి, పాటుపడుతున్న రాయల్ క్లబ్స్‌కు తన వంతు సహకారం అం దిస్తానని, క్లబ్ కేంద్ర కార్యాలయ నిర్మాణానికి సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. పేదరికంతో కాపులు విద్యకు దూరం కాకుడదనే రాయల్ క్లబ్స్ ద్వారా సేవలు అందిస్తున్నామని క్లబ్ జాతీయ అధ్యక్షుడు సుంకర కృష్ణ తెలి పారు. క్లబ్ ట్రస్టు చైర్మన్ పేటేటి పుల్లయ్య, క్లబ్ జాతీయ మాజీ అధ్యక్షుడు మిరియాల వెంకటేశ్వరరావు, ప్రోగ్రాం కమిటీ చైర్మన్ రామిశెట్టి కొండలరావు, వై.శివరామకృష్ణయ్య, కోశాధికారి గునుకుల పుల్లయ్య, యర్రంశెట్టి శ్రీనివాస రావు పాల్గొన్నారు.