వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి అండగా నిలిచారు. ఈ క్రమంలో టీడీపీ నేతల అక్రమ కేసులు, దాడులకు బలైన వారికి రక్షణ కల్పించేందుకు, బాధితులను పరామర్శించేందుకు వైయస్ జగన్ సిద్ధమయ్యారు. నేడు నెల్లూరు జిల్లాకు వైయస్ జగన్ వెళ్లనున్నారు. నెల్లూరు జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించనున్నారు. ఇక, రానున్న రోజుల్లో వైయస్ జగన్.. పార్టీ కేడర్ కోసం న్యాయ పోరాటం చేస్తూనే బాధితులను కలుస్తూ వారికి భరోసా ఇవ్వనున్నారు.
![]() |
![]() |