ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం సమావేశమయ్యారు. అమరావతి, పోలవరంతో పాటు ఏపీకి చెందిన పలు అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై చంద్రబాబు చర్చించనున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా బాబు... పలువురు కేంద్ర పెద్దలతో భేటీ అవుతున్నారు. నిన్న(బుధవారం) సాయంత్రమే ముఖ్యమంత్రి హస్తినకు చేరుకున్నారు.
![]() |
![]() |