డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురం అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఇప్పటికే గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని 4 అంతస్థుల భవనం కొనుగోలు చేసిన పవన్.. దాన్ని కార్యాలయంగా వాడుకుంటున్నారు. పిఠాపురంలో సొంతిళ్లు కట్టుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బుధవారం స్థలం కొని, రిజిస్ట్రేషన్ చేయించారు. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, 2.08 ఎకరాల రెండు బిట్లు తీసుకున్నారు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఇందులో రెండు ఎకరాల స్థలంలో క్యాంపు ఆఫీసు, మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకుని, పిఠాపురంలో నివసిస్తానని పవన్ నియోజకవర్గ ప్రజలకు మాట ఇచ్చారు.
![]() |
![]() |