కడప జిల్లాలో మూడు రోజులు పర్యటించనున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకులకు హాజరుకానున్న జగన్.. ఈ మేరకు కడప జిల్లాలో మూడు రోజులు పర్యటించనున్నారు. ఈ నెల 8వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఇడుపులపాయలో ఘనంగా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఈ నెల 6 ,7 ,8 మూడు రోజులు జిల్లాలోనే మకాం వేయనున్న జగన్..రేపు ఉదయం బయలుదేరతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa