ఉచిత ఇసుక పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలను దారుణంగా మోసం చేస్తోందని వైయస్ఆర్ సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు ఉచితం అంటూనే చార్జీలు బాదేస్తున్నారని, ఇసుక రీచ్ లలో రేట్లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో ఏడాదికి రూ.750 కోట్ల ఆదాయం ఖజానాకు వచ్చిందని, ఇప్పుడు ఆ సొమ్మంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోందని ప్రశ్నించారు. ప్రజలపై ఒక్క రూపాయి కూడా భారం మోపకుండా ఉచితంగా ఇసుక ఇవ్వాలని డిమాండ్ చేశారు.