రాజకీయ కక్ష పెట్టుకున్న వ్యక్తులు 24 మంది మారణాయుధాలతో తన కుమారుడు కామిరెడ్డి నర్సింహారావు (నాని)పై హత్యాయత్నానికి తెగబడ్డారని, వారిపై చర్యలు తీసుకుని, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని ఏలూరు జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరం గ్రామానికి చెందిన పోస్టుమాస్టర్ కామిరెడ్డి ఆనంద్‌బాబు, కామిరెడ్డి జలజాక్షి.. జిల్లా అడిషనల్ ఎస్పీ స్వరూపారాణికి ఫిర్యాదు చేశారు. మంగళవారం ఏలూరు ఎస్పీ కార్యాలయంలో ఈ అంశాలను మీడియాకు వివరించారు. ఈ నెల 7న శ్రీరామవరంలోని తన ఇంట్లోకి 24 మందితో పాటు మరికొంత మంది అక్రమంగా ప్రవేశించారని, తన కుమారుడు వైయస్ఆర్‌సీపీ దెందులూరు మండల అధ్యక్షుడు కామిరెడ్డి నర్సింహారావు (నాని) ఇంట్లో ఉండటాన్ని గమనించి తన కుమారుడిని చంపాలనే ఉద్దేశంతో మారణాయుధాలతో వచ్చారని వివరించారు. వారు తనకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేశారని చెప్పారు. తన కుమారుడు వెనుక వైపునకు వెళ్లి ఒక గదిలో తలుపు వేసుకుని ఉండగా గదిని పగులగొట్టి తన కుమారుడిని చంపే ప్రయత్నం చేస్తున్న సమయంలో పోలీసులు రాగా రాత్రి ఒంటి గంట సమయంలో వారంతా వెళ్లిపోయారన్నారు. ఎప్పటికైనా చంపేస్తామని బెదిరించారని చెప్పారు. తన కుటుంబసభ్యులను కూడా దుర్భాషలాడి భయభ్రాంతులకు గురి చేసి చోడవరపు లక్ష్మణరావు అనే వ్యక్తిని కూడా గాయపరిచారన్నారు. తమ ఇంట్లో పోస్టాఫీస్ ఫరి్నచర్, తన ఇంటి అద్దాలు, కురీ్చలు, తన కుమారుడి కార్యాలయం ధ్వంసం చేశారని తెలిపారు. తన కుమారుడిపై హత్యాయత్నం చేసిన వారందరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. తన కుమారుడికి, తమ కుటుంబానికి భద్రత కలి్పంచాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదుతో పాటు ఫొటోలు, సీడీలు ఎస్పీకి జతపరిచినట్లు తెలిపారు.