బెంగళూరు-విజయవాడ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని కనిగిరి ఆర్డీవో జాన్ ఇర్విన్ ఆదేశించారు. భూ వివాదాలను సత్వరమే పరిష్కరించుకోవాలని రైతులకు సూచించారు. మర్రిపూడి మండల పరిషత్ సమావేశం హాలులో రైతులు, రెవెన్యూ సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్డీవో మాట్లాడారు. రైతుల సమస్యల కారణంగా రహదారి పనులకు అవాంతరాలు ఏర్పడటానికి వీలులేదన్నారు. మండలంలోని పన్నూరు, మర్రిపూడి, కూచిపూడి, తిప్పలదేవిపల్లె, గార్లపేట గ్రామాలకు చెందిన 66 మంది రైతులకు నష్టపరిహారం చెల్లించి భూసేకరణ చేయాల్సింది ఉందని ఈసందర్భంగా ఆయన వివరించారు. రెం డు, మూడు రోజుల్లో రైతులు తామంతట తాము వివాదాలు పరిష్కరించుకుని నష్టపరిహారం తీసుకోకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. క్షేత్ర స్థాయి రెవెన్యూ సిబ్బంది ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్న ఆయన.. పనితీరు మార్చుకోకపోతే కఠి న చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వరప్రసాద్, త హసీల్దార్ కె.బి.టి.సుందరమ్మ, డిప్యూటీ తహసీల్దార్ కేఆర్ భూపతి, సిబ్బంది పాల్గొన్నారు.