విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని పాఠశాలలో విద్యార్థుల అభివృద్ధికి ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం అనపర్తిలోని శ్రీరామారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని కిట్ల పంపిణీని ప్రారంభించారు. అనపర్తి ఎంఈవోలు నల్లమిల్లి సత్తిరెడ్డి, పుష్పలతల అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ పరిధిలో 15,249 మంది విద్యార్థులు ఒక్కొక్కరికీ రూ.2500 విలువైన కిట్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నల్లమిల్లిని ప్రధానోపాధ్యాయుడు పులగం వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఉపాధాయులు సత్కరించారు. ఈ కార్యక్ర మంలో ఎన్డీయే నాయకులు సిరసపల్లి నాగేశ్వరరావు, సత్తి దేవ దానరెడ్డి, తమలంపూడి సుధాకరరెడ్డి, కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, కర్రి వెంకటరామారెడ్డి, గొలుగూరి రామ భాస్కరరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్ధినీ విద్యార్థులు పాల్గొన్నారు.