రాష్ట్రం అప్పులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వాస్తవాలు చెబుతున్నా.. పట్టించుకోకుండా రాద్దాంతం చేస్తున్నారని పేర్ని నాని వెల్లడించారు. చంద్రబాబు నెల రోజుల పాలనంతా క్షేత్ర పర్యటనలు, శ్వేతపత్రాల పేరుతో గత ప్రభుత్వంపై నిందల పర్వంతోనే కొనసాగిందని గుర్తు చేశారు. తప్పుడు లెక్కలు, అంకెలు, అసత్యాలతో చంద్రబాబు వైట్ పేపర్లు రిలీజ్ చేస్తున్నారని తేల్చి చెప్పారు. రాష్ట్ర అప్పులు రూ.4 లక్షల కోట్ల వరకు ఉన్నాయని, కేంద్రం స్పష్టం చేసినా, ఇక్కడ బీజేపీ అధ్యక్షురాలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా, రాష్ట్ర అప్పులు రూ.15 లక్షల కోట్లు అని చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పారు.