మరోసారి ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు చోటుచేసుకున్నాయి. 62 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ స్థాయిలో బదిలీలు జరగడం ఇదే తొలిసారి కాగా.. బదిలీలపై గత కొన్నిరోజులుగా సీఎం చంద్రబాబు కసరత్తు చేసినట్లు తెలిసింది. మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్‌గా సీహెచ్. శ్రీదత్‌ను బదిలీ చేశారు. అలాగే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అదనపు బాధ్యతలు కూడా ఆయనకు అప్పగించారు. హ్యాండ్‌లూమ్స్, టెక్స్‌టైల్స్ శాఖ కమిషనర్‌గా రేఖారాణిని బదిలీ చేశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, కమిషనర్‌గా ఎం.వి. శేషగిరిని నియమించారు. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా చేవూరి హరికిరణ్‌ను బదిలీ చేశారు. సెర్ప్ సీఈవో వీరపాండ్యన్‌ను నియమించారు. మల్లికార్జునను బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. అలాగే భూ సర్వే, సెటిల్‌మెంట్ల డైరెక్టర్‌గా శ్రీకేష్ బాలాజీరావును ఏపీ ప్రభుత్వం నియమించింది.పౌరసరఫరాల శాఖ ఎండీగా గిరీషాను, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ప్రసన్న వెంకటేష్‌ను నియమించారు.
మార్క్‌ఫెడ్ ఎండీ- మంజీర్ జిలాని
ఏపీసీపీడీసీఎల్ సీఎండీ - రవి సుభాష్
మెడికల్ సర్వీసెస్ ఎండీ - లక్ష్మీషా
గృహ నిర్మాణ కార్పొరేషన్ ఎండీ - రాజాబాబు
మహిళా, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్- వేణుగోపాల్‌రెడ్డి
ఇంటర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ - కృతికా శుక్లా
గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ - బి. నవ్య
ఏపీ మారీటైమ్ బోర్డు సీఈవో- ఆదిత్య
తిరుపతి మున్సిపల్ కమిషనర్ - నారపురెడ్డి మౌర్య
జీసీసీ ఎండీ - కల్పన కుమారి
ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డైరెక్టర్ - నిషాంత్‌కుమార్
ఏపీఐఐసీ ఎండీ - అభిషిక్త్ కిషోర్
అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్ - విజయ సునీత
హార్టికల్చర్ ఎండీ - కె.శ్రీనివాసులు
సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ - లావణ్య వేణి
తిరుపతి జేసీ - శుభం బన్సాల్
కడప జేసీ - అతిథి సింగ్
ఏలూరు జేసీ - ధాత్రి రెడ్డి
అల్లూరి జిల్లా జేసీ - అభిషేక్ గౌడ
వీరితో పాటుగా మొత్తం 62 మంది ఐఏఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. పాలనలో ప్రక్షాళన తీసుకువచ్చే దిశగా అధికార యంత్రాంగంలో మార్పులు చేస్తోంది టీడీపీ కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే ఈ స్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు.